: క్రైస్ట్ చర్చ్ మ్యాచ్ లో కరీబియన్ల పరుగుల వరద... పాక్ లక్ష్యం 311


వరల్డ్ కప్ లో భాగంగా నేటి తెల్లవారుజామున పాకిస్థాన్, వెస్టిండిస్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే టీమిండియా చేతిలో ఘోరపరాజయం మూటగట్టుకున్న పాక్ కు వెస్టిండిస్ పైనా విజయం దక్కే సూచనలు కనిపించడం లేదు. టాస్ గెలిచిన పాక్, బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మొత్తం 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసి పటిష్ట స్థితికి చేరుకుంది. వెస్టిండిస్ జట్టు స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ (4) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్లందరూ రాణించారు. ఒక్క బ్యాట్స్ మెన్ కూడా సెంచరీ సాధించకున్నా, రెండు అర్ధ శతకాలు నమోదయ్యాయి. 311 పరుగుల విజయలక్ష్యంతో పాక్ మరికాసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News