: పాకిస్థాన్ రాజపుత్రులు భారత రాజవంశంతో వియ్యమొందారు!
పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదులు అంటే భారతీయులు ఎంత ద్వేషిస్తారో, పాక్ ప్రజలంటే అంత ఆప్యాయత చూపిస్తారు. తాజాగా అది మరోసారి నిరూపితమైంది. పాక్, భారత్ కు చెందిన ప్రముఖ రాజకుటుంబాలు ఒక్కటయ్యాయి. వరుడు పాకిస్థాన్ లో గొప్ప హిందూ రాజకుటుంబం, రాజపుత్రుల వంశానికి చెందిన కర్నిసింగ్ కాగా, వధువేమో కనోటా కుటుంబీకులు, జైపూర్ మాజీ కమాండర్ జనరల్ అమర్ సింగ్ వారసురాలు అయిన పద్మినీ సింగ్ రాథోడ్. వరుడి కుటుంబీకులు కూడా రాజస్థాన్ కు చెందిన వారే. కానీ దేశ విభజన సమయంలో వేరయ్యారు. దేశ సరిహద్దులు దాటి రెండు రాజకుటుంబాలు ఒక్కటవ్వడంతో మీడియా దృష్టి సారించింది. ఇరు దేశాల్లోని రాజపుత్రులు ఈ వివాహంతో ఒక్కటయ్యారు.