: 'పారాహుషార్'... భారత్ పుంజుకుంది: స్మిత్


భారత్ పుంజుకుందని, ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించేందుకు సిద్ధంగా ఉందని దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ హెచ్చరించాడు. ఐసీసీకి రాసిన కాలమ్ లో ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగుతున్న భారత జట్టును తక్కువగా అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుందని ఆయన స్పష్టం చేశాడు. కెప్టెన్ ధోనీ, చిచ్చరపిడుగు విరాట్ కోహ్లీకి తోడుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఉత్తమ బ్యాట్స్ మన్ అని స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరిగే మ్యాచ్ లో ఎవరు అత్యుత్తమ ప్రదర్శన చేస్తే వారే టైటిల్ ఫేవరేట్లని స్మిత్ తెలిపాడు.

  • Loading...

More Telugu News