: తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాదులోని జేఎన్ టీయూ-హెచ్ అధికారులు ఎంసెట్ షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 25న సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్ 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. తేదీ దాటిన తరువాత రూ.10 జరిమానాతో మే 12 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి 20 వరకు దరఖాస్తుల్లో తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు అవకాశం. మే 8 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 14న ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. 28న ర్యాంకుల ప్రకటన. అయితే ఏపీలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని, ఏపీ విద్యార్థులు ఎంసెట్ రాయాలనుకుంటే తెలంగాణలోనే రాయాలని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు.