: తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో అన్యమత ప్రచారం... విద్యార్థుల ఆందోళన
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో అన్యమత ప్రచారం జరుగుతోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ క్రిష్టఫర్ దృష్టికి తీసుకువెళ్ళినా ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇటీవల అన్యమత ప్రచార గ్రంధాలు లభ్యమైనా ఆయన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వేసిన కవులు, రచయితలూ, నేతల పెయింటింగ్స్ పై శిలువ గుర్తులు ఉన్నాయని విద్యార్థి సంఘాలు వెల్లడించాయి. ఈ విషయమై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.