: అభిమానుల ఒత్తిడికి తలొగ్గిన మరాఠా మందిర్... కొనసాగనున్న డీడీఎల్జే
షారూక్ ఖాన్ అభిమానులకు, అందునా సూపర్ హిట్ ఫిల్మ్ 'దిల్వాలే దుల్హానియా లేజాయింగే' (డీడీఎల్జే) చిత్ర ప్రేమికులకు శుభవార్త. ముంబైలోని మరాఠా మందిర్ లో ఈ చిత్ర ప్రదర్శన కొనసాగనుంది. గత 20 సంవత్సరాలుగా మరాఠా మందిర్ లో డీడీఎల్జే ప్రదర్శితమవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రదర్శనను నేటి నుంచి నిలిపివేయనున్నట్టు థియేటర్ యాజమాన్యం ప్రకటించగా, వేలాది మంది చిత్ర అభిమానులు ప్రదర్శన కొనసాగించాలని ఫోన్లు, ఇ-మెయిల్స్ ద్వారా డిమాండ్ చేశారు. దీంతో థియేటర్ హక్కులు కలిగివున్న యష్ రాజ్ ఫిలిమ్స్ అభిమానుల ఒత్తిడికి తలొగ్గింది. కాగా, 1995 నుంచి డీడీఎల్జే చిత్రం ఈ సినిమా హాలులో ప్రదర్శితమవుతోంది.