: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై కోడిగుడ్లు... యూత్ కాంగ్రెస్ నిరసన
ఒడిశా సీఎం కాన్వాయ్ పై నిన్న కోడిగుడ్లు పడ్దాయి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లోనే చోటుచేసుకున్న ఈ ఘటనతో సీఎం సహా ఆయన పార్టీ బిజూ జనతాదళ్ నేతలు షాక్ కు గురయ్యారు. ఉత్కళ్ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యక్రమానికి వెళుతున్న నవీన్ పట్నాయక్ కాన్వాయ్ ను అడ్డుకున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం కారుపై కోడిగుడ్లు విసిరారు. ఊహించని ఘటనతో తేరుకున్న పోలీసులు లాఠీలకు పనిచెప్పి, ఆందోళనకారులను తరిమికొట్టారు. దీనిపై బీజేడీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. విద్యార్థి సంఘం కార్యక్రమానికి వెళుతున్న సీఎంపై దాడి చేయడం దారుణమని బీజేడీ నేత ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేయగా, నాలుగేళ్లుగా ఉద్యోగ ప్రకటనలు వెలువరించని నవీన్ కోడిగుడ్ల దాడికి అర్హుడేనని కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ మాఝీ అన్నారు.