: మోదీకి ఇష్టం లేదేమోలే... నలంద వర్సిటీ వీసీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా: అమర్త్యసేన్
నలంద విశ్వ విద్యాలయం ఉప కులపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ప్రకటించారు. ప్రస్తుతం వర్సిటీ వీసీగా వ్యవహరిస్తున్న ఆయనను ఆ పదవిలో కొనసాగించేందుకు నరేంద్ర మోదీ సర్కారు అంత సానుకూలంగా లేదు. అమర్త్యసేన్ ను మరింతకాలం పాటు వర్సిటీ వీసీగా కొనసాగించాలని వర్సిటీ పాలక మండలి ఇదివరకే కేంద్రానికి ప్రతిపాదించింది. అయితే నెలరోజులైనా దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఏ నిర్ణయమూ ప్రకటించలేదు. దీంతో మనస్సు నొచ్చుకున్న అమర్త్యసేన్, మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ‘‘బహుశా నన్ను మరింతకాలం పాటు వర్సిటీ వీసీగా కొనసాగించేందుకు మోదీకి ఇష్టం లేదేమోలే. లేకపోతే దీనిపై నిర్ణయంలో నెల జాప్యం ఎందుకు? అందుకే నేనే స్వచ్ఛందంగా తప్పుకుంటున్నా’’ అని అమర్త్యసేన్ ప్రకటించారు.