: గత్యంతరం లేకే రాజీనామా చేశా: మాంఝీ
బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం జితన్ రాం మాంఝీ మీడియాతో మాట్లాడారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే బలపరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా చేశానని చెప్పారు. మంత్రులను, ఎమ్మెల్యేలను నితీష్ కుమార్ బెదిరించారని ఆరోపించారు. అసెంబ్లీలో రహస్య ఓటింగ్ కోరానని, అందుకు స్పీకర్ నిరాకరించారని తెలిపారు. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఉంటే తాను విశ్వాస పరీక్షలో నెగ్గేవాడినని మాంఝీ అన్నారు. ఇప్పటికీ తనకు 140 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పారు. నితీష్ నీచ రాజకీయాలు చేస్తున్నారన్న ఆయన, అసెంబ్లీ సీటింగ్ ను కూడా వారికి అనుగుణంగా మార్చుకున్నారని మండిపడ్డారు.