: అదో రహస్య ప్రపంచం... మొబైల్ ఫోన్లకు, భార్యా బిడ్డలకు దూరమై పనిలో తలమునకలైన కేంద్ర ప్రభుత్వ అధికారులు!


మరో 8 రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానున్న వార్షిక బడ్జెట్ రూపకల్పన ఆసాంతం అత్యంత రహస్యంగా సాగుతుంది. మొబైల్ ఫోన్లకు, భార్యా బిడ్డలకు దూరమై, రేయింబవళ్ళూ అధికారులు శ్రమిస్తున్నారు. అన్ని నెట్‌వర్క్‌ లింకులు, ఇంటర్నెట్ కట్‌ చేయబడ్డ కంప్యూటర్లపై పని జోరుగా జరుగుతుంది. మరో రెండు మూడు రోజుల్లో అన్ని ప్రతిపాదనలతో కూడిన బడ్జెట్‌ సీడీ ముద్రణ కోసం వెళ్తుందని సమాచారం. ఈ ముద్రణా కార్యాలయం న్యూఢిల్లీ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ లోని నార్త్‌ బ్లాక్‌ బేస్‌ మెంట్‌ లో ఉంది. ప్రింటింగ్‌ పనిలో నిమగ్నమైన టెక్నికల్‌ అధికారులు, లీగల్‌ అధికారులు, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో అధికారులు, నార్త్‌ బ్లాక్‌ లో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది అంతా ఎవరూ బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా నిబంధనలు ఉన్నాయి. అక్కడే తిని, అక్కడే విశ్రమించే వీరంతా ఆర్థికమంత్రి లోక్‌ సభ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరమే బయటకు వస్తారు. బడ్జెట్ కాపీలు కేవలం 10 నిమిషాల ముందు మాత్రమే మంత్రివర్గ సహచరులకు అందుతాయి. ఈనెల 28న పార్లమెంటులో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను సమర్పించనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News