: స్టార్ స్పోర్ట్స్ కు సుప్రీంలో చుక్కెదురు... దూరదర్శన్ లో ప్రసారం కానున్న వరల్డ్ కప్ మ్యాచ్ లు


ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ పోటీల ప్రత్యక్ష ప్రసారం విషయంలో స్టార్ స్పోర్ట్స్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. ప్రసార భారతికి అనుకూలంగా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేబుల్ ఆపరేటర్ లతో దూరదర్శన్ తన ఫీడింగ్ పంచుకోవచ్చని తెలిపింది. దూరదర్శన్ లో మ్యాచ్ లను ప్రసారం చేయడం ద్వారా తాము పెట్టుబడిగా పెట్టిన కోట్లాది రూపాయలను నష్టపోతున్నామని స్టార్ స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హైకోర్టు స్టార్ స్పోర్ట్స్ కు అనుకూలంగా తీర్పివ్వగా, నేడు సుప్రీం వాటిని నిలుపుదల చేసింది.

  • Loading...

More Telugu News