: తిరుమల అర్చకుల మధ్య వివాదాలు వద్దు: చంద్రబాబు


తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకుల మధ్య వివాదాలు వద్దని ఏపీ సీీఎం చంద్రబాబు సూచించారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారి ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, నరసింహదీక్షితులు, ఇతర ఆలయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం బాబు మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ ఛానల్ లో నాణ్యమైన కార్యక్రమాలు ప్రసారం చేయాలని చెప్పినట్టు తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం తిరుమలను మరింత అభివృద్ధి చేస్తామని, ఇబ్బందులున్నా హామీలు నెరవేర్చడానికే ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News