: కేజ్రీవాల్ బాటలో కేసీఆర్... తెలంగాణ సచివాలయంలోకి మీడియాకు నో ఎంట్రీ?


తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బాటలో పయనిస్తున్నారు. ఢిల్లీ పాలన పగ్గాలను ఇటీవల చేపట్టిన కేజ్రీవాల్ సచివాలయంలోకి మీడియా ప్రవేశంపై పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. ‘‘అవసరమైతే మేమే పిలుస్తాం... ప్రభుత్వాధికారులను కలవాలనుకుంటే అనుమతి తీసుకోవాల్సిందే’’ అంటూ కేజ్రీవాల్ సర్కారు నిన్న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం వెలువడిందో, లేదో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే దిశగా అడుగులు వేసేందుకు ఉపక్రమించింది. ‘‘అయినా ఎప్పుడూ ఈ మీడియా గోలేంది? ఇక్కడ వాళ్లకేం పని?’’ అని నిన్న కేసీఆర్, అధికారుల వద్ద అసహనం వ్యక్తం చేశారట. ‘‘అవసరమైతే మనమే వారిని పిలుద్దాం. అవసరం లేనప్పుడు వారినెందుకు సచివాలయంలోకి అనుమతించాలి?’’ అని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారట. ఈ నేపథ్యంలో సచివాలయంలోకి మీడియా ప్రవేశాన్ని నిషేధిస్తూ నేడో, రేపో తెలంగాణ సర్కారు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయన్న ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News