: తెలంగాణలో జిందాల్, ఏపీలో స్విస్ కన్సార్టియంల పెట్టుబడులు!
తెలుగు రాష్ట్రాలకు నిన్న పెట్టుబడులు పోటెత్తాయి. తెలంగాణకు జిందాల్ తరలిరాగా, ఏపీకి స్విస్ కన్సార్టియం పెట్టుబడులతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన బయ్యారం భూముల్లో ఉక్కు కంపెనీని నిర్మించేందుకు జిందాల్ స్టీల్ ఆసక్తి కనబరచింది. ఈ మేరకు నిన్న జిందాల్ ప్రతినిధులు సీఎం కేసీఆర్ తో భేటీ సందర్భంగా బయ్యారం ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, మరో తెలుగు రాష్ట్రం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు స్విస్ కన్సార్టియం ముందుకొచ్చింది. ఇటీవల స్విట్జర్లాండ్ పర్యటనలో చంద్రబాబును కలిసిన స్విస్ కన్సార్టియం నిన్న ఏపీలో పర్యటించింది. శ్రీకాకుళం జిల్లాతో పాటు విశాఖలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సదరు కన్సార్టియం ప్రతినిధులు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు.