: డిన్నర్ లో టీమిండియా గురించే చర్చ... కోహ్లీ గట్టిపిండం: సఫారీ కోచ్
దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాతో సమరాన్ని కీలకమైన పోరాటంగా భావిస్తోంది. దీనిపై ఆ జట్టులో అన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి డిన్నర్ లో సఫారీ జట్టు టీమిండియా గురించే చర్చించిందని ఆ జట్టు కోచ్ రస్సెల్ డొమింగో తెలిపారు. అసలే టీమిండియా బలమైన జట్టు అని, అందులోను కోహ్లీ మరింత గట్టిపిండమని పేర్కొన్నాడు. కోహ్లీని అవుట్ చేస్తే సగం విజయం సాధించినట్టేనని తన జట్టుకు కోచ్ చెప్పాడు. టీమిండియా విజయాల్లో కోహ్లీదే కీలక భాగస్వామ్యమని ఆయన పేర్కొన్నాడు. కోహ్లీ ఆటే టీమిండియా బలమని చెప్పిన ఆయన, తాము ఎవరినీ లక్ష్యం చేసుకోవడం లేదని చెప్పాడు. విరాట్ తో పాటు, రైనా, రోహిత్, ధోనీ, రహానే గురించి తాము చర్చించామని ఆయన వివరించాడు. టీమిండియా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకుని తమ జట్టు ఆడుతుందని ఆయన స్పష్టం చేశాడు.