: లేడీ గాగాకు ప్రేమికుల రోజు గిఫ్ట్... ఖరీదైన వజ్రపుటుంగరం!
ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగాకు ఈ వేలంటైన్స్ డే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే, లేడీ గాగాకు అద్భుతమైన వజ్రపుటుంగరం ఇచ్చి ఆమె బాయ్ ఫ్రెండ్ టేలర్ కిన్నే ప్రపోజ్ చేశాడు. దానిని అంగీకరించిన లేడీ గాగా, ఆ ఉంగరాన్ని ధరించి సిగ్గుల మొగ్గయింది. వినూత్నమైన వస్త్రధారణతో అభిమానులను అలరించే లేడీ గాగాకు ప్రేమికుల రోజున టేలర్ కిన్నేతో ఎంగేజ్ మెంట్ అయింది. ఈ సందర్భంగా టేలర్ కిన్నే ఈ వజ్రపుటుంగరం ఇచ్చాడు. హృదయాకారంలో ఉండే ఆ వజ్రం చివరన తన పేరు, లేడీ గాగా అసలు పేరులోని మొదటి అక్షరాలు ఉండేలా చూశాడు. లేడీ గాగా అసలు పేరు స్టెఫానే జో అన్నా ఏంజెలినా జెర్మనొట్టా. ప్రపంచం మొత్తం లేడీ గాగా అంటూంటే ప్రియుడు మాత్రం అసలు పేరుతోనే పిలుస్తాడట. టీ (టేలర్) ఎస్ (స్టెఫానే) అనే అక్షరాల మధ్య అందంగా పొదిగిన లవ్ సింబల్ వజ్రంతో ఉంగరం ముచ్చటగా ఉందని, తనకు చాలా నచ్చిందని లేడీ గాగా ముచ్చటగా చెప్పింది. ఆ ఉంగరం ఫోటోలను కూడా తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది.