: మోదీ సూటు ధర పైపైకి పోతోంది
ప్రదాని నరేంద్ర మోదీకున్న క్రేజ్ ఆయన సూటు వేలంలో ప్రస్పుటమవుతోంది. రెండో రోజు కొనసాగుతున్న వేలంలో ఈ ఉదయం 1.25 కోట్ల రూపాయలకు రాజేశ్ మహేశ్వరి అనే వ్యక్తి బిడ్ వేశారు. మధ్యాహ్నం 1.39 కోట్ల రూపాయలకు ముఖేష్ పటేల్ అనే వ్యక్తి బిడ్ దాఖలు చేశారు. అనంతరం కమల్ కాంత్ శర్మ అనే వ్యాపారి అత్యధికంగా 1.41 కోట్ల రూపాయలకు బిడ్ వేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటన సందర్భంగా మోదీ వేసుకున్న బంద్ గళా సూట్ ను వేలానికి పెట్టారు. కాగా, ఈ వేలం రేపు సాయంత్రం వరకు జరగనుంది. ఈ సూటుతోపాటు మరికొన్ని బహుమతులను కూడా వేలానికి ఉంచారు. అలా సమకూరిన మొత్తాన్ని గంగానదీ ప్రక్షాళనకు ఉపయోగించనున్నారు.