: అనిల్ కుంబ్లేకు అరుదైన గౌరవం కల్పించిన ఐసీసీ


టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకి అరుదైన గౌరవం లభించింది. ఐసీసీ హాల్ ఆప్ ఫేమ్ లో కుంబ్లేకి ఐసీసీ సభ్యత్వం కల్పించింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో 77వ సభ్యుడిగా అనిల్ కుంబ్లేకి స్థానం కల్పిస్తున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే సుదీర్ఘ కాలం క్రికెట్ ను కొనసాగించి, అత్యున్నత శిఖరాలు అధిరోహించిన అతి కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే దీనిలో సభ్యత్వం కల్పిస్తారు. కుంబ్లేతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మాజీ మహిళా క్రికెటర్ బెట్టీ విల్సన్ కు కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటుకల్పించింది.

  • Loading...

More Telugu News