: ఆ బాలికకు అతీంద్రియ శక్తులున్నాయా?
అతీంద్రియ శక్తుల నేపథ్యంలో వచ్చిన హాలీవుడ్ సినిమా ఎక్స్ మెన్ చూశారా? అందులోలాగే ఇప్పుడు ఓ యువతి దేనిని పట్టుకుంటే అది మాడిమసైపోతోందట. ఝాన్సీ దగ్గర్లోని గోరమాచియ గ్రామంలోని ఓ బాలిక ఇలా అందర్నీ ఆకట్టుకుంటోంది. కొన్నేళ్ల క్రితం ఆ గ్రామంలోని ఈ బాలిక తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో ఆ గ్రామ పెద్ద బాలికను దత్తత తీసుకున్నాడు. తరువాత బాలిక చేయితగిలితే చాలు కరెంటు వెలుగుతుందని, బాలిక ముట్టుకున్న వస్తువులు మాడి మసైపోతున్నాయని ప్రచారం చేశాడు. దీనికి తోడు బాలికకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని అతను చెబుతున్నాడు. దీంతో ఆ గ్రామస్థులు వణుకుతున్నారు. ఆ బాలిక పొరపాటున ఎవర్నైనా ముట్టుకుంటే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై కొందరు బాలికకు దివ్య శక్తులు ఉన్నాయని చెబుతుంటే, మరికొందరు బాలికకు దెయ్యం పట్టిందని చెబుతున్నారు. మొత్తానికి ఈ వార్తలు ఆ గ్రామాన్ని, సదరు బాలికను వార్తల్లోకి ఎక్కించాయి. అయితే బాలిక వివరాలు మాత్రం గోప్యంగా ఉంచడం విశేషం.