: చంద్రమోహన్ కోలుకుంటున్నారు: మేనల్లుడు


గుండెపోటుకు గురై హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ కోలుకుంటున్నారని ఆయన మేనల్లుడు కృష్ణప్రసాద్ తెలిపారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రి వద్ద ఆయన మాట్లాడుతూ, మావయ్య ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. రెండు రోజుల్లో వైద్యులు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారని కృష్ణప్రసాద్ వెల్లడించారు. కాగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటనా చాతుర్యం ప్రదర్శించిన చంద్రమోహన్ కు అశేషమైన అభిమానగణం ఉంది.

  • Loading...

More Telugu News