: ఇక సెలవు...'మూవీ మొఘల్' అంతిమయాత్ర ముగిసింది


దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ అంతిమయాత్ర ముగిసింది. దిగ్గజ నిర్మాతకు టాలీవుడ్ విషణ్ణవదనంతో వీడ్కోలు పలికింది. తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డగా ఎందరో కళాకారులను, సాంకేతిక నిపుణులను వెండి తెరకు పరిచయం చేసి, వన్నె తరగని సినిమాలతో భారతీయ సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసిన దిగ్గజ నిర్మాత రామానాయుడుకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రపరిశ్రమ ఘనవీడ్కోలు పలికింది. తెలుగు సినీ రంగంతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తీ రామానాయుడు అంత్యక్రియలకు తరలివచ్చారు. కుటుంబ సభ్యులు రామానాయుడు స్టూడియోస్ లో ఆయన అంతిమ సంస్కారాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.

  • Loading...

More Telugu News