: మరాఠా మందిర్ లో ముగుస్తున్న 'దిల్ వాలే...' సుదీర్ఘ ప్రయాణం


బాలీవుడ్ సిల్వర్ స్ర్ర్ర్కీన్ పై 20 ఏళ్ల కిందట చరిత్ర సృష్టించిన ఎవర్ గ్రీన్ చిత్రం 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే'. అప్పటి నుంచి ఇప్పటివరకు ముంబయిలోని మరాఠా మందిర్ లో నిరాటంకంగా ప్రదర్శితమవుతూనే ఉంది. ఈ క్రమంలో నేటితో 1009 వారాలు పూర్తి చేసుకుంది. అద్భుతమైన ఈ ప్రేమ కావ్యం ప్రదర్శన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించబోతున్నట్టు మార్కెట్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఈ మేరకు ఆ థియేటర్ వారు బోర్టు పెట్టారు. షారుక్ ఖాన్, కాజోల్ నటించిన 'దిల్ వాలే...' అక్టోబర్ 19, 1995లో విడుదలైంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్యా చోప్రా ఈ అద్భుత దృశ్య కావ్యాన్ని రూపొందించారు.

  • Loading...

More Telugu News