: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఏపీ కాంగ్రెస్ నేతల భేటీ
ఢిల్లీలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ, కొప్పుల రాజు పలువురు ఆయన నివాసంలో కలిశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్ ఉభయసభల్లో ఒత్తిడి చేయాలని రఘువీరా కోరారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో కూడా సమావేశమయ్యారు.