: మాకూ ఒక రోజు వస్తుంది... ఆస్ట్రేలియానూ మట్టి కరిపిస్తాం!


క్రికెట్ లో ఆస్ట్రేలియాను ఆపడం కష్టమేనని, అయితే అది అసాధ్యం మాత్రం కాదని బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీం వ్యాఖ్యానించాడు. పటిష్ఠమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించే సత్తా తమకుందని, నేడు కాకుంటే, ఏదో ఒక రోజున కంగారూలను ఓడిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. తమకూ ఒక రోజు వస్తుందని, తమదైన రోజున ఆసీస్ ను కూడా కట్టడి చేస్తామన్న ధీమాను రహీం వ్యక్తం చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో అప్ఘానిస్తాన్ పై తొలి మ్యాచ్ ఆడిన బంగ్లాదేశ్ 105 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, బిస్బ్రేన్ లో శనివారం ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ పోటీ పడనుంది.

  • Loading...

More Telugu News