: పరీక్షల కుంభకోణంలో మధ్యప్రదేశ్ గవర్నర్ కొడుకు!


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షల కుంభకోణం మరింత వివాదాస్పదమయింది. ఈ కుంభకోణంలో గవర్నర్ రామ్‌ నరేశ్ యాదవ్ కుమారుడి పేరు వెలుగులోకి రావడంతో, విపక్షాల నిరసనలు తీవ్రమయ్యాయి. 2013లో సంచలనం సృష్టించిన ఎంపీపీఈబీ (మధ్యప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డు) కుంభకోణంలో పలువురు రాజకీయ నేతలు, అధికారుల ప్రమేయం ఉందని, వీరంతా ప్రభుత్వ ఉద్యోగాలను తమవారికి కట్టబెట్టేందుకు, ముందే ప్రశ్నా పత్రాలు లీక్ చేయించడం దగ్గర్నుంచి, ఇంటర్వ్యూల వరకూ అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా, గవర్నర్ కొడుకు పేరు రావడంతో, ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఎవరు ఒత్తిడి చేసినా పదవికి రాజీనామా చేయనని గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్ తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News