: బీహార్ సీఎం మనవడ్ని చితక్కొట్టిన మద్యం వ్యాపారులు
బీహార్ సీఎం జీనత్రాం మాంఝీ మనవడు అమిత్ మాంఝీపై కొందరు మద్యం వ్యాపారులు దాడి చేశారు. మధుబన్ జిల్లా రాణిపూర్ లో పర్యటించిన అమిత్ పై స్థానిక మద్యం వ్యాపారులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తమపై తరచూ పోలీసులు దాడులు జరపడానికి సీఎం మనవడు అమిత్ మాంఝీయే కారణమని భావించిన మద్యం వ్యాపారులు ఆయనను చితక్కొట్టారు. దీంతో ఆయన సదార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.