: రామానాయుడు మృతి పట్ల బాలీవుడ్ సంతాపం


ప్రముఖ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మూవీ మొఘల్ రామానాయుడు మృతికి బాలీవుడ్ సంతాపం ప్రకటించింది. దేశంలోని ప్రముఖ బాషలన్నింటిలోనూ సినిమాలు నిర్మించిన రామానాయుడు మృతి భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని బాలీవుడ్ ప్రకటించింది. నటుడు రితేష్ దేశ్ ముఖ్, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి తదితరులు తమ సంతాపం ప్రకటిస్తూ ట్విట్టర్ లో సందేశాలు పోస్టు చేశారు. కాగా, బాలీవుడ్ లో చాలా మందితో వెంకటేష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాక యువహీరో రానా బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. రానా నటించిన తాజా హిందీ సినిమా 'బేబీ' సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News