: ఇకపై తీవ్రవాదులు ఆ వీడియోలను ఎక్కడ తీశారో కనిపెట్టేయొచ్చు


ఐఎస్ఐఎస్ వంటి తీవ్రవాద సంస్థలు తీసే వీడియోలను గుర్తించడం చాలా కష్టంగా మారుతోంది. ఎడారుల్లో, కొండల్లో వారు తీసే వీడియోలు ఎక్కడి నుంచి తీస్తున్నారు? అనే విషయాన్ని కనిపెట్టొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో ఫోటోలు పెట్టిన తరువాత కనిపించకుండా పోయిన వ్యక్తులను వెతికి పట్టుకోవడానికి, ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు సంబంధించి పంపే వీడియోలను బట్టి అవి ఎక్కడి నుంచి తీశారో కనుక్కునేందుకు ఈ తరహా ఆల్గారిథమ్స్ ఉపయోగపడతాయని పరిశోధకులు వెల్లడించారు. స్పెయిన్ లో బార్సిలోనాకు చెందిన శాస్త్రవేత్తలు కొత్తగా రూపొందించిన టెక్నాలజీ ద్వారా ఏ ప్రదేశంలో వీడియో తీశారో గుర్తించలేకుండా తీసిన వీడియోలలో ఆ ప్రదేశాన్ని గుర్తించడం అసాధ్యమేమీ కాదని చెప్పారు. తాము రూపొందించిన ఆల్గారిథమ్స్ ద్వారా కొన్ని వీడియోలు తీసిన ప్రాంతాలను గుర్తించామని, కొన్ని వీడియోల ప్రదేశాలను పది కిలోమీటర్ల తేడాతో గుర్తించగా, కొన్ని వీడియోల్లో కేవలం కిలోమీటర్ దూరాన్ని కనిపెట్టగలిగామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని ద్వారా ఇకపై అలాంటి వీడియోలు తీసిన ప్రదేశాలు కనిపెట్టడం సులువని అభివర్ణించారు.

  • Loading...

More Telugu News