: ఆప్ కు ఊరట...నిధుల సేకరణలో చట్ట ఉల్లంఘన లేదు: న్యాయస్థానం
ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరట లభించింది. చట్టవ్యతిరేకంగా ఆప్ నిధులను సేకరించిందని ఆరోపిస్తూ పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆప్ నిధుల సేకరణలో అవలంబించిన విధానాలు, అవకతవకలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్రం న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. నిధుల సమీకరణలో ఆప్ చట్టాన్ని ఉల్లంఘించలేదని తెలిపింది. ఆప్ కు అందిన విదేశీ నిధులపై దర్యాప్తు చేపట్టామని, ఆ నిధులలో చట్టవ్యతిరేకమైనవేవీ లేవని కేంద్రం వివరణ ఇచ్చింది. దీంతో ఆప్ నిధులలొల్లిలో పసలేదని తేలిపోయింది.