: కోస్ట్ గార్డ్ డీఐజీ వ్యాఖ్యలపై దర్యాప్తు చేపడతాం: పారికర్
కోస్ట్ గార్డ్ డీఐజీ వ్యాఖ్యలపై దర్యాప్తు చేపడతామని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గత డిసెంబర్ 31న భారత్ తీరప్రాంతం వైపు వస్తున్న పాకిస్థాన్ మరపడవను తీరగస్తీ దళం వెంబడించగా, పడవలోని వాళ్లు తమను తాము పేల్చేసుకున్నారని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. అయితే వాళ్లు ఆ పడవను పేల్చేసుకోలేదని, తన ఆదేశాల మేరకే కోస్ట్ గార్డ్ అధికారులే ఆ పడవను పేల్చేశారని, డీఐజీ బీకే లోషాలీ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి, తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.