: విమానంలో భోజనానికి రుచి ఎందుకు పోతోంది?


విమాన ప్రయాణికులకు పంచభక్ష పరమాన్నాలు పెట్టినా తినబుద్ధి కావడం లేదట. కడుపులో ఎలుకలు పరుగెడుతున్నా ముద్ద కూడా దిగడం లేదట. దీంతో మంచి భోజనం పెట్టాలని విమానయాన సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరుగా మిగులుతున్నాయట. దీనికి కారణాలు పరిశోధకులు అన్వేషించారు. ప్రధాన కారణం ఏంటంటే, విమానం 30 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన తరువాత నాలుక మొద్దుబారిపోతుందట. మన మెదడుపై పడే ఒత్తిడి ప్రభావం నాలుకపై కూడా చూపిస్తుందని వారు తెలిపారు. రెండవ కారణం ఏంటంటే... మన నాలుకపై రుచిని గుర్తించే కణజాలం జీవిత కాలం కేవలం 15 రోజులే! అందువల్ల బాగా ఎత్తుకు ఎగరడంతో ఈ కణజాలం రుచిని గుర్తించలేకపోతోంది. అదీ కాక భూఉపరితలం మీద వంటచేసిన పదార్థాలు విమానంలో వేడి చేసి అందించడం వల్ల కూడా రుచి మారిపోతుంది. అలాగే కేబిన్ లో ఉండే పొడి వాతావరణం కూడా రుచి మారడానికి కారణమని వారు తేల్చేశారు. ఈ ఆహారపదార్థాల్లో కొంత మెంతిని కలిపితే రుచిని రక్షించవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ రుచి లేకపోవడం కేవలం ఆహార పదార్థాలకే కాదు. వైన్ కి కూడా వర్తిస్తుందట. వైన్ రుచీపచీ లేకుండా చప్పగా ఉంటోందట. వైన్ లో ఏం కలిపితే రుచి మారకుండా ఉంటుందనే పరిశోధనలు జోరుగా జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News