: గిన్నిస్ రికార్డు దాటేసినా నిర్మాణం ఆపలేదు!
తెలుగు సినీ రంగాన చిన్న సినిమాకు ఊపిరి పోసింది మూవీ మొఘల్ రామానాయుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ ను బట్టి సినిమా నిర్మించడానికి, బడ్జెట్ దాటి ఖర్చుపెట్టడానికి ఆయన వ్యతిరేకం. 'కథను బట్టి నటీనటులు ఉండాలే తప్ప, నటీనటులను బట్టి కథ వుండకూడదు' అనే విధానాన్ని కచ్చితంగా ఆచరించిన నిర్మాత ఆయన. 1963లో సినీ నిర్మాణం మొదలు పెట్టిన రామానాయుడు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో 101 సినిమాలను నిర్మించి గిన్నిస్ రికార్డు సాధించారు. 2012లో ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ అందించింది. అయినప్పటికీ ఆయన సినీ నిర్మాణం ఆపలేదు. చాలాకాలం పంజాబీలో సినిమా నిర్మించాలన్న ఆశను నెరవేర్చుకున్నారు. దీంతో ఆయన 150 సినిమాలను దాటేశారు. ఆయనలాంటి నిర్మాత తెలుగు సినీ పరిశ్రమే కాకుండా దేశ సినీ రంగంలో మరోవ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు.