: వైజాగ్ లో సినీ పరిశ్రమను ఎలా అభివృద్ధి చేయాలనేదే రామానాయుడి ధ్యాస


ప్రముఖ నిర్మాత రామానాయుడు మృతితో తెలుగు సినీ పరిశ్రమే కాకుండా, దేశంలోని సినీ ప్రముఖులంతా షాక్ కు గురయ్యారు. ఆయన మృతికి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాదులో ఉన్న సినీ రంగానికి చెందిన వారంతా హుటాహుటిన రామానాయుడి నివాసానికి చేరుకుంటున్నారు. అయితే, గత 13 ఏళ్ల నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్న రామానాయుడు కోలుకున్నారనే అందరూ భావించారు. ఇటీవలే ఆయన చిన్న కుమారుడు, సినీ నటుడు వెంకటేష్ మాట్లాడుతూ, తన తండ్రి కోలుకుంటున్నారని తెలిపారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ, ఆయన మనసంతా సినిమాల మీదే ఉందని చెప్పారు. వైజాగ్ లో సినీ పరిశ్రమను ఎలా అభివృద్ధి చేయాలన్న విషయం గురించే ఆయన ఆలోచిస్తున్నారని... తన సోదరుడు సురేష్ తో ఇదే విషయమై చర్చిస్తున్నారని వెల్లడించారు. అయితే, అందరినీ బాధలో ముంచెత్తుతూ ఆయన వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News