: ఇండస్ట్రీలో అలాంటి నిర్మాత లేరు: మురళీమోహన్


ప్రముఖ నిర్మాత రామానాయుడు మృతి చెందడంపై 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ స్పందించారు. రామానాయుడు మరణించడం దురదృష్టకరమని అన్నారు. అన్ని భాషల్లో చిత్రాలు తీయడం మామూలు విషయం కాదని కీర్తించారు. అందుకే ఆయనకు గిన్నిస్ బుక్ లో స్థానం దక్కిందని తెలిపారు. ఇండస్ట్రీలో అటువంటి నిర్మాత లేరని కొనియాడారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న మూవీ మొఘల్ రామానాయుడు ఈ మధ్యాహ్నం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. సినీ రంగ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. రామానాయుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • Loading...

More Telugu News