: రామానాయుడి మరణం నన్ను ఎంతో బాధిస్తోంది: జగన్


ఎందరికో మార్గదర్శకుడిగా నిలిచి, మనసున్న మనిషిగా సినీ పరిశ్రమలో అందరి ఆదరాభిమానాలను చూరగొన్న వ్యక్తి రామానాయుడని వైకాపా అధినేత జగన్ కొనియాడారు. ఆయన మృతి చెందారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని, ఆయన మరణం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక భాషల్లో వందకు పైగా చిత్రాలను నిర్మించి, గిన్నిస్ బుక్ రికార్డుల్లోకెక్కిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే తత్వం రామానాయుడిదని జగన్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • Loading...

More Telugu News