: రన్ వేపై రాజుకున్న అగ్గి
దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేపై అగ్గి రాజుకుంది. విమానాశ్రయం రన్ వే ఇరువైపులా గడ్డి పెరగడంతో పక్షులు మేతకు వస్తుంటాయి. అవి విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తుండడం సర్వసాధారణం. వీటిని తరిమికొట్టేందుకు విమానాశ్రయ సిబ్బంది టపాసులు పేలుస్తారు. అలా పేల్చిన టపాసుల్లోంచి ఎగసిపడ్డ నిప్పురవ్వలు రన్ వే పక్కనే ఉన్న గడ్డిపై పడడంతో అక్కడున్న ఎండుగడ్డికి అంటుకుని మంటలు చెలరేగాయి. ఇవి అలముకోవడంతో విమానాశ్రయ సిబ్బంది వాటిని ఆర్పేశారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు.