: ఆఫ్ఘన్ జట్టు గెలిచిందట... ముందే ట్వీట్ చేసిన అమెరికన్ ఎంబసీ


బంగ్లాదేశ్ జట్టుతో వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలిచిందంటూ కాబూల్ లో అమెరికన్ ఎంబసీ ట్విట్టర్లో పేర్కొనడం చర్చనీయాంశం అయింది. మ్యాచ్ ఇంకా పూర్తి కాకముందే, ఆఫ్ఘన్ జట్టు గెలిచిందని అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో, ఆఫ్ఘన్ క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. అమెరికన్ ఎంబసీ నిర్వాకం మీడియా ద్వారా శరవేగంతో పాకిపోయింది. దీంతో, విషయం గ్రహించి నాలిక్కరుచుకున్న ఎంబసీ అధికారులు మరో ట్వీట్ తో తప్పు దిద్దుకునే ప్రయత్నం చేశారు.

  • Loading...

More Telugu News