: గుజరాత్ వివాదాస్పద పోలీస్ డీజీ వంజారా విడుదల
గుజరాత్ లో అత్యంత వివాదాస్పద పోలీసు అధికారిగా ముద్రపడ్డ డీజీ వంజారాకు సబర్మతి జైలు నుంచి విడుదలవ్వగానే ఘన స్వాగతం లభించింది. భారీగా వచ్చిన ఆయన మద్దతుదారులు నినాదాలతో ప్రశంసిస్తుండగా, మరోవైపు పలువురు వంజారాను తమ మొబైల్ కెమెరాలో బంధించేందుకు పోటీ పడ్డారు. అనంతరం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేసి మాట్లాడారు. ఎన్నికల్లో విజయం పొందిన అభ్యర్థిలా చేయి ఊపుతూ అభిమానులను పలకరించారు. ఇదే సమయంలో పలువురు ఆయన మెడను పూలదండలతో నింపివేశారు. దాదాపు ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవించిన వంజారాకు, రెండు ఎన్ కౌంటర్ హత్యల కేసుల్లో ఈ నెలలో పలు షరతులపై ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. రెండు ఫేక్ ఎన్ కౌంటర్లలో ఏడుగురు పౌరులను పలువురు పోలీసు అధికారులు హతమార్చిన కేసులో వంజారా ఒకరు.