: జగన్ ది భరోసా యాత్ర కాదు... మనుగడ యాత్ర: పయ్యావుల కేశవ్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మరోమారు విరుచుకుపడ్డారు. కేసుల్లో ఇరుక్కున్న తనను తాను రక్షించుకునేందుకే జగన్ యాత్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ చేస్తున్న యాత్ర... భరోసా యాత్ర కాదన్న పయ్యావుల, దానిని మనుగడ యాత్రగా అభివర్ణించారు. గడచిన ఎన్నికల్లో ఓటమితో నానాటికి క్షీణించిపోతున్న పార్టీని రక్షించుకునేందుకే ఈ మనుగడ యాత్రను జగన్ చేపడుతున్నారని ఆయన అన్నారు. జగన్ యాత్రల పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయారని కూడా పయ్యావుల అన్నారు. లక్షలాది ఎకరాల భూములను కోల్పోయిన బయ్యారం, సోంపేట బాధిత రైతు కుటుంబాలను పరామర్శించే దమ్ము జగన్ కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు.