: హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్


ఢిల్లీ, మహారాష్ట్ర పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. అంతకు ముందు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన కేసీఆర్... రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తో భేటీ అయి... ప్రాణహిత-చేవెళ్ల, లెండి వంటి పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. తన పుట్టిన రోజును సైతం కేసీఆర్ ముంబైలో జరుపుకోవడం విశేషం. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు సమక్షంలో ఆయన తన బర్త్ డే కేక్ ను కట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News