: వజ్రాల నగరంలో వజ్రంలాంటి ఆఫర్... కోటి రూపాయలిస్తా... ఆ కోటు ఇస్తే!
వజ్రాల నగరంగా పేరున్న సూరత్ లో ప్రధాని మోడీ ధరించిన కోటుకు కోటి రూపాయల ధర పలికింది. గతనెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఆయన ధరించిన స్పెషల్ కోటును వేలానికి ఉంచిన సంగతి తెలిసిందే. రూ.11 లక్షల వద్ద వేలం మొదలు కాగా, సూరత్ వ్యాపారి సురేష్ అగర్వాల్ తనవంతు బిడ్ గా రూ.1 కోటిని దాఖలు చేశారు. వేలం మరో రెండు రోజులు ఉండటంతో ఈ కోటుకు మరింత ధర రావచ్చని అంచనా. వివిధ సందర్భాల్లో మోదీకి బహుమతిగా వచ్చిన మొత్తం 455 వస్తువులను వేలంలో ఉంచారు. ఈ వస్తువులను అమ్మగా వచ్చిన నిధులను 'స్వచ్ఛ భారత్'కు ఇవ్వాలన్నది మోదీ మదిలోని ఆలోచన.