: మధుకోడా బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించిన సీబీఐ


ఝార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా దాఖలు చేసుకున్న బెయిల్ అభ్యర్థనకు సీబీఐ వ్యతిరేకత తెలిపింది. బెయిల్ ద్వారా బయటకు వెళితే కోడా సాక్షులను ప్రభావితం చేస్తారని బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టుకు తెలిపిన సీబీఐ వెల్లడించింది. ఓ సంస్థకు గనులు కేటాయించేలా ఆయన కుట్ర పన్నారని సీబీఐ వాదించింది. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్తా పీఎంవో (ప్రధాని కార్యాలయం)ను తప్పుదారి పట్టించారని పేర్కొంది. దాంతో కోడాకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

  • Loading...

More Telugu News