: బహిష్కరణను లెక్క చేయం... వివాదాన్ని జేపీనే పరిష్కరించాలి: లోక్ సత్తా నేత కటారి
లోక్ సత్తా జాతీయ కమిటీ విధించిన బహిష్కరణను లేక్కచేయబోమని ఆ పార్టీ కీలక నేత కటారి శ్రీనివాసరావు అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సురేంద్ర శ్రీవాస్తవను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ నియమించారన్న కటారి, ప్రస్తుత వివాదాన్ని కూడా జేపీనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాతీయ కమిటీ నామినేటెడ్ కమిటీ అంటూ, దానిని తాము పరిగణనలోకి తీసుకోమని ప్రకటించిన కటారి, డీవీవీఎస్ వర్మ, రమేశ్ రెడ్డిలను జాతీయ అధ్యక్షుడు శ్రీవాస్తవ బహిష్కరించిన సంగతి తెలిసిందే.