: 'ఫిబ్రవరి 18' ఏపీకి చీకటి రోజు.. దేశం నేత మోదుగుల


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలకు నేడు చీకటిరోజని తెలుగుదేశం నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి పార్లమెంట్ ఆమోదం పలికి నేటికి సరిగ్గా సంవత్సరం అయిందని ఆయన గుర్తుచేశారు. టీవీ లైవ్ కవరేజ్ నిలిపివేసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును అప్రజాస్వామ్యంగా ఆమోదించుకుందని ఆరోపించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అసంబద్ధ విభజన కారణంగానే, నేడు నీటి యుద్ధాలు, ఉద్యోగుల పంపిణీలో సమస్యలు తదితరాలు తలెత్తాయని మోదుగుల విమర్శించారు. 'ఫిబ్రవరి 18'ని, ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని తరతరాలు గుర్తు పెట్టుకుంటాయని, ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ను శిక్షిస్తూనే ఉంటారని అన్నారు.

  • Loading...

More Telugu News