: టీఆర్ఎస్ తో బీజేపీ పొత్తా?... అవన్నీ గాలి వార్తలు: కిషన్ రెడ్డి


టీఆర్ఎస్ తో బీజేపీ పొత్తుపెట్టుకోబోతోందంటూ వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తుకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు జాతీయ నేతలతో తాను చర్చించినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. అలాంటి చర్చలేవీ జరగలేదని, అవన్నీ గాలి వార్తలే అని కొట్టి పారేశారు. కేంద్రంలో టీఆర్ఎస్ కు రెండు మంత్రి పదవులు, రాష్ట్రంలో బీజేపీకి రెండు మంత్రి పదవులు కేటాయించేలా చర్చలు జరిగాయన్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పారు.

  • Loading...

More Telugu News