: రూ.60 కోట్లు వసూలు చేసిన డేరా బాబా 'ఎంఎస్ జీ' చిత్రం


'డేరా సచ్చా సౌదా' అధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్ నటించిన 'ఎంఎస్ జీ-ద మెసెంజర్' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీగా కాసుల వర్షం కురిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ నెల 13న 4,000 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా నాలుగు రోజులకే రూ.60 కోట్లు వసూలు చేసింది. విమర్శకుల నుంచి భిన్న స్పందనను పొందుతున్న ఈ చిత్రం బాలీవుడ్ సినిమా 'రాయ్'కు పోటీ ఇస్తోంది. త్వరలో వందకోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఈ సినిమా విడుదలను బ్యాన్ చేశాయి. అంతకుముందు పలు వివాదాలు, విమర్శల నడుమ ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు విడుదల సర్టిఫికెట్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News