: మోదీ సూట్ కోసం రూ. 51 లక్షల ఆఫర్... వేలంలో బిడ్ వేసిన బీజేపీ కార్పొరేటర్


ప్రధాని నరేంద్ర మోదీ బంద్ గలా సూట్ కు సూరత్ వేలంలో భారీ ధరనే వచ్చేటట్టుంది. భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఇంప్రెస్ చేసేందుకు పదుల సంఖ్యలో డ్రెస్సులను మార్చిన నరేంద్ర మోదీ మోడల్ అవతారమే ఎత్తారు. ఈ క్రమంలో ఆయన రూ.10 లక్షల విలువ చేసే బంద్ గలా సూట్ పై ‘నరేంద్ర దామోదర్ దాస్ మోదీ’ అనే పేరును నిలువు గీతలుగా రాయించుకున్నారు. తాజాగా ఈ సూట్ సూరత్ లో వేలానికి వచ్చింది. సదరు సూట్ ను దక్కించుకునేందుకు పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అందరికంటే ముందుగా సూరత్ నగర కార్పొరేటర్ ఒకరు రూ.51 లక్షలను కోట్ చేస్తూ సదరు సూట్ కోసం బిడ్ దాఖలు చేశారట. సదరు కార్పొరేటర్ బీజేపీకి చెందిన నేతనే అని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News