: బంగారు తాళం చెవి విరిగిపోయిందంతే... సుప్రభాత సేవలో ఆలస్యం లేదు: టీటీడీ జేఈఓ
తిరుమల వెంకన్న సుప్రభాత సేవకు సంబంధించి నేటి తెల్లవారుజామున జాప్యం చోటుచేసుకుందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. రోజు మాదిరిగానే శ్రీవారి సుప్రభాత సేవను తెల్లవారుజామున 3 గంటలకే ప్రారంభించామని ఆయన తెలిపారు. అయితే శ్రీవారి బంగారు వాకిలి తెరుస్తున్న క్రమంలో తాళం చెవి విరిగిపోయిందని, దీంతో తాళాన్ని పగులగొట్టి 2.30 గంటలకే తలుపులు తెరిచామని ఆయన వెల్లడించారు. సుప్రభాత సేవలో జాప్యం జరగకున్నా, ఆలస్యం జరిగినట్లు మీడియాకు సమాచారం ఇవ్వడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రభాత సేవలో జాప్యం జరిగిందన్న వార్తలపై ఈవో సాంబశివరావు విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.