: సాధారణ ఇంజనీరు... రూ.10 వేల కోట్ల ఆస్తిపరుడు!


అతను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఒక చీఫ్ ఇంజనీరు. అయితేనేం, అవినీతి సంపాదన విషయంలో మాత్రం రాజకీయ నాయకులనే మించిపోయాడు. యాదవ్ సింగ్ అనే ఈ వ్యక్తి లెక్కకు అందనంత ఆస్తులు సంపాదించాడు. ప్రభుత్వ ఉద్యోగి ఇంత ఆస్తులు కష్టపడి సంపాదించడం అసంభవం. ఇటీవల ఆదాయపు పన్ను అధికారులు ఆయన ఇంటి మీద రైడ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన వద్ద రూ.10 వేల కోట్లకు పైనే విలువచేసే ఆస్తులు లభ్యం కావడంతో అధికారులు అవాక్కయ్యారు. సుమారు రూ.100 కోట్ల విలువైన డైమండ్స్, రెండు కేజీల బంగారం, 20కి పైగా ప్రాంతాల్లో స్థిరాస్తులు, ఆయన భార్య పేరిట 40 బోగస్ కంపెనీలు, పెద్దమొత్తంలో నగదు పట్టుపడింది. ఇప్పుడా కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని, ప్రత్యేక విచారణా బృందం యూపీ ప్రభుత్వాన్ని కోరగా, ఇంతవరకూ దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కాలేదు. ఆయనను విచారిస్తే, ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తవచ్చన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News