: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్... మరికాసేపట్లో అప్ఘానిస్థాన్ తో మ్యాచ్
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మెగాటోర్నీలో భాగంగా మరికొద్దిసేపట్లో బంగ్లాదేశ్ జట్టు, అఫ్ఘానిస్థాన్ తో తలపడనుంది. ఆస్ట్రేలియా నగరం కాన్ బెర్రాలో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. మొన్నటి మ్యాచ్ లో దిగ్గజ వెస్టిండిస్ ను ఐర్లాండ్ మట్టికరిపించడంతో చిన్న జట్లు ఆడుతున్న మ్యాచ్ లపై ఆసక్తి పెరిగింది. బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య జరగనున్న నేటి మ్యాచ్ పై దిగ్గజ జట్లు ప్రత్యేక దృష్టి సారించాయి.